హీరో శ్రీవిష్ణు, ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజవరగమన’. హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్టైన్మెంట్స్తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ సుంకర సమర్పించిన ఈ చిత్రం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు మంగళవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
‘మేం వేసిన ప్రివ్యూస్‌కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నవ్వించాలని ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఫ్యామిలీ, యూత్‌కి చాలా నచ్చుతుంది. ప్రివ్యూస్ చూసిన ప్రేక్షకులు నాన్ స్టాప్‌గా నవ్వుతూనే ఉన్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ క్లీన్ ఎంటర్టైనర్. కడుపుబ్బా నవ్విస్తుంది. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఇందులో మాటలు కూడా కొత్తగా ఉంటాయి. హాస్య మూవీస్, ఎకె ఎంటర్టైన్మెంట్స్తో పని చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తారు. అలాగే అనుకున్నదాని కంటే భారీగా తీశారు. హీరోయిన్గా చేసిన రెబా మోనికా జాన్ తెలుగుకి కొత్త. హీరోయిన్ పాత్రలో కూడా చాలా ఫన్ ఉంటుంది. తను చాలా చక్కగా నటించింది. కథాపరంగా చూస్తే, తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రాని పాయింటే చెబుతున్నాం. చాలా డిఫరెంట్‌గా, కొన్ని ఊహించని మలుపులు కూడా ఉంటాయి. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఫ్యామిలీస్‌కి మూడు రోజుల ముందే సినిమా చూపించాం. అందుకే ఈ సినిమా కోసం ఆహ్వాన యాత్ర చేశాం. ప్రస్తుతం ‘హుషారు’ ఫేం హర్షతో యువీలో ఒక సినిమా చేస్తున్నా. అలాగే ‘రాజరాజ చొర’కి ప్రీక్వెల్ చేస్తున్నాను’ అని శ్రీ విష్ణు తెలిపారు.
ఆద్యంతం నవ్వించే సినిమా
11:02 pm