‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా అరంగేట్రం చేసిన హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్’తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
‘మాది భీమడోలు పక్కన యం.నాగుల పల్లి. ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ సినిమా తర్వాత ఆనంద్ అనే కోడైరెక్టర్ తేజ గారికి పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి ‘అహింస’ స్క్రిప్ట్ వరకూ తేజ గారితోనే జర్నీ చేశాను. ఈ సినిమాకి కష్ణ చైతన్య కథ అందించారు. ఇదొక థ్రిల్లర్. కథ గురించి ఏం చెప్పినా సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఇష్టమైన ఫోన్, అవసరమైన ఐడెంటిటీ.. భయపెట్టే గన్.. ఈ మూడింటి చుట్టూ కథ ఉంటుంది. హీరోకి, కమీషనర్‌కి వార్ ఎలా వచ్చిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ముఫ్ఫై నిమిషాలకు ఊహించని మలుపు వస్తుంది. ఇందులో మీరు ఎండ్‌ని, విలన్‌ని, కథ ఏ స్వరూపంలోకి వెళుతుందో అనేది ఊహించలేరు. సినిమా ఆసాంతం ఎంగేజ్ చేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది. ఇప్పటి వరకు మూడు ప్రివ్యూలు వేశాం. అన్నింటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరో సినిమా చేస్తున్నామని మా నిర్మాత సతీష్ అడ్వాన్స్ ఇచ్చారు. అలాగే మూడు పెద్ద బ్యానర్ల నుంచి కాల్స్ వచ్చాయి’ అని అన్నారు.