ధాన్యం తరలింపునకు లారీలను కేటాయించాలి

తహసీల్ధార్‌కు బీఆర్‌ఎస్‌ వినతి
నవతెలంగాణ-మల్హర్‌రావు
మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తర లించడానికి లారీలను కేటాయించాలని మండల బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం మండల తహశీల్దార్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టి రోజులు గడుస్తున్నా లారీలను అలర్ట్‌ చేయకపోవడంతో ధాన్యం బస్తాలు కళాల్లోనే ఉండటం ద్వారా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి సమస్య భవిష్యత్తులో పునరావతం కాకుండా,రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల్లో ఉం దన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్య క్షుడు కుంభం రాఘవరెడ్డి,పిఏసిఎస్‌ ఛైర్మెన్‌ మల్క ప్రకాష్‌ రావు, ఎంపిటిసి సభ్యులు రావుల కల్పన మొగిలి,పిఏసిఎస్‌ డైరెక్టర్‌ మల్క రాజేశ్వర్‌ రావు,మంథని మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ దెవర్నేని రాజేశ్వర్‌ రావు, సర్పంచ్‌లు సత్య నారా యణ, విజయ నాగేశ్వర్‌ రావు, నాయకులు బూడిద మల్లేష్‌, సాంబయ్య గౌడ్‌, మధుసూదన్‌ రావు, నార రమేష్‌, లక్ష్మణ్‌, నార సమ్మయ్య, రాజయ్య పాల్గొన్నారు.

Spread the love