స్పై.. రిలీజ్‌కి రెడీ

నిఖిల్‌ నటించిన ‘స్పై’ సినిమా వాయిదా పడిందనే రిపోర్ట్స్‌తో నిఖిల్‌ ఫ్యాన్స్‌, సినీ అభిమానులు నిరాశ చెందారు. సుభాష్‌ చంద్రబోస్‌ హిడెన్‌ స్టొరీ, సీక్రెట్స్‌ ఆధారంగా గ్యారీ బిహెచ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గతంలో ప్రకటించిన తేదీకే (ఈనెల 29న) సినిమాని విడుదల చేస్తామని మేకర్స్‌ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం శరవేగంతో గ్రాఫిక్స్‌ పనులు జరుగుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడానికి 1000 మంది నైపుణ్యం కలిగిన సిజీ సాంకేతిక నిపుణులతో 4 కంపెనీలను నిర్మాతలు నియమించుకున్నారు.
రిలీజ్‌ డేట్‌ వార్తని ధవీకరిస్తూ నిఖిల్‌, ‘క్వాలిటీ లాక్‌… టార్గెట్‌ లాక్‌… స్పై లాక్‌.. జూన్‌ 29న వరల్డ్‌వైడ్‌ థియేటర్లలో..’ అని ట్వీట్‌ చేశారు. మెషిన్‌ గన్‌ పట్టుకుని, సుభాష్‌ చంద్రబోస్‌తో సహా స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల బ్యాక్‌డ్రాప్‌లో నిలబడిన పోస్టర్‌ను కూడా ఆయన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
ఈ సినిమా టీజర్‌కి అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. నిర్మాత కె రాజశేఖర్‌ రెడ్డి కథ అందించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో విడుదల కానుంది.
ఆర్యన్‌ రాజేష్‌, ఐశ్వర్య మీనన్‌, సన్యా ఠాకూర్‌, అభినవ్‌ గోమతం, మకరంద్‌ దేశ్‌పాండే, జిషు సేన్‌ గుప్తా, నితిన్‌ మెహతా, రవివర్మ, కష్ణ తేజ, ప్రిషా సింగ్‌, సోనియా నరేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ : వంశీ పచ్చిపులుసు, మార్క్‌ డేవిడ్‌, రచయిత : అనిరుధ్‌ కష్ణమూర్తి.

Spread the love