ఛాలెజింగ్‌ రోల్‌ చేశా..

హీరో నిఖిల్‌ నటించిన తాజా చిత్రం ‘స్పై’. ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
పై కె.రాజ శేఖర్‌ రెడ్డి నిర్మించారు. నిఖిల్‌ సరసన ఐశ్వర్య మీనన్‌ నాయికగా నటించింది. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌ మీడియాతో ‘స్పై’ విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘ఇది నా మొదటి తెలుగు సినిమా. దర్శకుడు గ్యారీ చెప్పిన
కథ విని చాలా థ్రిల్‌ అయ్యాను. అందుకే మరో ఆలోచన లేకుండా సైన్‌ చేశాను. ఇదొక ఎగ్జైటింగ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. అందరికీ నచ్చుతుంది. ఇందులో నా పాత్రకు చాలా కోణాలు ఉంటాయి. యాక్షన్‌, స్టంట్స్‌ అన్నీ ఉంటాయి. రా ఏజెంట్‌గా కనిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. యాక్షన్‌, గన్‌ షూటింగ్‌లో దాదాపు ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. తొలి సినిమాలోనే ఛాలెంజింగ్‌ రోల్‌ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ‘స్పై’కి పార్ట్‌ 2 చేసే స్కోప్‌ ఉంది. ఒకవేళ అది జరిగితే అందులోనూ నేనే హీరోయిన్‌గా ఉండాలనేది నా కోరిక (నవ్వుతూ). నిఖిల్‌ బ్రిలియంట్‌ యాక్టర్‌. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా చేస్తున్నా.

Spread the love