ప్రేమలో కొత్త కోణం

ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకుని నేటితరం ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా రూపొందించిన సరికొత్త ప్రేమకథా చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా-జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది.
ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించిన సందర్భంగా నిర్మాత సుభాష్‌ మాట్లాడుతూ,’చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కావడానికి ముఖ్య కారణం యుఎఫ్‌ఓ మూవీస్‌ సంస్థ. ఈ సినిమా చూసి హీరో, హీరోయిన్‌ బాగా చేశారని, మూవీ డైరెక్షన్‌ బాగుందని, అలాగే పాటలు బ్యాక్‌ బోన్‌ అని, ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేసేందుకు తాము సపోర్ట్‌ చేస్తామని యు ఎఫ్‌ ఓ ఎపి, తెలంగాణ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.లక్ష్మణ్‌ చెప్పారు. మా చిత్రాన్ని పాన్‌ ఇండియా వైడ్‌ రిలీజ్‌ చేస్తున్న యుఎఫ్‌ఓ మూవీస్‌ వారికి స్పెషల్‌ థ్యాంక్స్‌’ అని అన్నారు. ఈ చిత్రానికి డిఓపి :ఈ.జె.వేణు, ఎడిటర్‌ : కార్తీక్‌ కట్స్‌, సంగీతం :విన్నూ, లిరిక్స్‌ : భాస్కరభట్ల, అనంత శ్రీరామ్‌, రాంబాబు గోసాల, కొరియోగ్రఫీ :రఘు, బాబా భాస్కర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్ర తివారి, లైన్‌ ప్రొడ్యూసర్‌: వంశీకష్ణ జూలూరి.

Spread the love