మాట విలువ, గౌరవాన్ని తెలిపే సినిమా

బూట్‌ కట్‌ బాలరాజుసోహెల్‌ టైటిల్‌ రోల్‌లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్‌ ఫిలిమ్స్‌, కథ వేరుంటాది బ్యానర్స్‌ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం ‘బూట్‌ కట్‌ బాలరాజు’. మేఘ లేఖ, సునీల్‌, సిరి హన్మంత్‌, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఈ చిత్ర ట్రైలర్‌ని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. హీరో సోహెల్‌ మాట్లాడుతూ, ‘మా బిగ్‌ బాస్‌ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు. విజరు లాంటి వారు వచ్చి సపోర్ట్‌ చేయడం చాలా అనందంగా ఉంది. నేను బిగ్‌ బాస్‌ నుంచి బయటికి రాగానే నాతో సినిమా చేస్తానని పాషా భారు చెప్పారు. ఆయన సాధారణమైన వ్యక్తే. చాలా ప్యాషన్‌తో సినిమాని పూర్తి చేశాం. ఈ సినిమా గురించి హీరో వెంకటేష్‌కి మెసేజ్‌ చేశాను. ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ వాయిస్‌ మెసేజ్‌ పెట్టారు. అంత పెద్ద హీరో నాకు రిప్లరు ఇవ్వడం చాలా నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. భీమ్స్‌ అద్భుతమైన పాటలు ఇచ్చారు’ అని తెలిపారు. ‘సోహెల్‌లో మంచి తపన ఉంది. తను తప్పకుండా విజయం సాధిస్తాడు. తప్పకుండా నిలబడతాడు. మంచి కథని పట్టుకోవడంలో గోపి దిట్ట. తను చేసిన ప్రతి సినిమా విజయం సాధించింది’ అని హీరో శివాజీ అన్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ,’కంటెంట్‌ ఉన్న ప్రతి సినిమా హిట్‌ అవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ పైసా వసూల్‌ వస్తుంది. అందరినీ బాగా ఎంటర్‌ టైన్‌ చేస్తుంది’ అని చెప్పారు. ‘ఇదొక మంచి వినోదాత్మక చిత్రం. మాటకి ఉన్న విలువ, గౌరవాన్ని గురించి ఈ చిత్రంలో చెబుతున్నాం. తప్పకుండా అందరూ థియేటర్స్‌కి వచ్చి చూడాలి’ అని దర్శకుడు శ్రీ కోనేటి తెలిపారు. సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలె మాట్లాడుతూ, ‘కష్టపడి ఒకొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చిన సోహెల్‌ కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. దర్శకుడు దగ్గర ఉండి మరీ ఇందులో పాటలు చేయించారు’ అని అన్నారు. ‘నాకు ట్రైలర్‌ బాగా నచ్చింది. పాటలు ఇంకా బాగా నచ్చాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని హీరో శివబాలాజీ చెప్పారు. మరో హీరో బాలాదిత్య మాట్లాడుతూ, ‘శంకరాభరణం, నేను నటించిన లిటిల్‌ సోల్జర్స్‌ ఈ రెండూ ఫిబ్రవరి 2న విడుదలై విశేష ఆదరణ పొందాయి. అదే డేట్‌కి వస్తున్న ఈసినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’ అని తెలిపారు.

Spread the love