భిన్న కాన్సెప్ట్‌తో సరిపోదా శనివారం

భిన్న కాన్సెప్ట్‌తో సరిపోదా శనివారంనాని, వివేక్‌ ఆత్రేయ రెండోసారి కలసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నాని కంప్లీట్‌ యాక్షన్‌-ప్యాక్డ్‌ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ థియేట్రికల్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఎస్‌ జే సూర్య కీలక పాత్రలో కనిపించ బోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణలో ఆయన జాయిన్‌ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర డైనమిక్‌గా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన ‘సరిపోదా శనివారం’ అన్‌చెయిన్డ్‌ వీడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో నాని రగ్గడ్‌ అండ్‌ ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్‌ ఇండియాలో చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోరు, డీవోపీ: మురళి జి, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

Spread the love