కనుల నీరు రాలదే..

కనుల నీరు రాలదే..సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్‌, రాధా ఆర్ట్స్‌ పతాకాలపై అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మిస్తున్నారు. సుధీర్‌ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ‘కనుల నీరు రాలదే.’ అనే లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘సినిమాను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. మాకు బిజినెస్‌లో సపోర్ట్‌ నిలుస్తున్నందుకు బెక్కెం వేణుగోపాల్‌కి, రామచంద్రకి థ్యాంక్స్‌. సుధీర్‌ అభిమానుల కోరిక మేకరకు మూవీ నుంచి రెండో పాటను కూడా గ్రాండ్‌గా రిలీజ్‌ చేశాం. తప్పకుండా పాట, సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ఈ పాటకు మోహిత్‌ మంచి సంగీతాన్ని అందించారు. దర్శకుడు అరుణ్‌ చాలా చక్కగా తెరకెక్కించారు’ అని తెలిపారు. ‘ఈ సినిమా తర్వాత సుధీర్‌ రేంజ్‌ నెక్ట్స్‌ రేంజ్‌కి చేరుకుంటుంది. మేం ఎంత బాగా సినిమాను తీసినా మంచి మ్యూజిక్‌ లేకపోతే అద్భుతం జరగదు. మోహిత్‌ తన సంగీతంతో మ్యాజిక్‌ చేశారు. అలాగే మార్క్‌ కె.రాబిన్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ను సూపర్బ్‌గా అందించారు’ అని అరుణ్‌ విక్కిరాలా అన్నారు.
హీరో సుధీర్‌ మాట్లాడుతూ, ‘మోహిత్‌ చాలా మంచి సంగీతాన్ని అందించారు. అలాగే జిత్తు మాస్టర్‌ సాంగ్‌ని చక్కగా కొరియోగ్రఫీ చేశారు. నిర్మాత విజేష్‌తో జర్నీ మరచిపోలేను. సినిమాను కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. బెక్కెం వేణుగోపాల్‌ సినిమా చూడగానే నచ్చటంతో మా టీమ్‌ని నడిపించటం మొదలు పెట్టారు. త్వరలోనే థియేటర్స్‌లో సందడి చేస్తాం. రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటిస్తాం’ అని అన్నారు.

Spread the love