ఎంటర్టైన్మెంట్తోపాటు మంచి మెసేజ్ ఉన్న సినిమా ‘కల్లు కాంపౌండ్ 1995′. గణేష్, ఆయూషి పటేల్ జంటగా బ్లూ హారీజోన్ మూవీ ప్యాక్టరీ బ్యానర్ పై ప్రవీణ్ జెట్టి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. పోసాని కష్ణమురళి, జీవా, ప్రవీణ్, బాలచందర్, గౌతమ్ రాజు, చిట్టి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బుర్రా మల్లేష్ గౌడ్ (బొట్టు), హారిక జెట్టి, పిట్ల విజయలక్ష్మీ సంయుక్తంగా నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హజరైన తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. హీరో గణేష్ మాట్లాడుతూ,’కన్నడలో చాలా సినిమాలలో నటించాను. కథకు సరిగ్గా సరిపోతానని నమ్మి ఎటువంటి ఆడిషన్ లేకుండా నాతో సినిమా చేశారు దర్శక, నిర్మాతలు. సినిమా చాలా బాగా వచ్చింది’ అని తెలిపారు. ‘స్టోరీ డిఫరెంట్‌గా ఉంటూ ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కచ్చితంగా కలుగుతుంది అలాగే మంచి మెసేజ్ కూడా చెప్పాం. మా సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసి సీనియర్ టెక్నిషియన్స్ మొచ్చుకుంటు న్నారు. అందరి సపోర్ట్‌తో మంచి అవుట్ పుట్ వచ్చింది’ అని దర్శకుడు ప్రవీణ్ జెట్టి చెప్పారు.