విక్రమ్‌ నట విశ్వరూపం

విక్రమ్‌ నట విశ్వరూపంవిక్రమ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘తంగలాన్‌’. దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌, జియో స్టూడియోస్‌ బ్యానర్స్‌ పై ప్రొడ్యూసర్‌ కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. బుధవారం విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్‌ డే విషెస్‌ చెెబుతూ ఈ సినిమా నుంచి స్పెషల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పా. రంజిత్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాం. ఆ అడ్వెంచర్‌ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్‌తో పాటు మూవీ టీమ్‌ నాకు ఎంతో సపోర్ట్‌ చేసింది. ప్రముఖ ప్రొడక్షన్‌ కంపెనీ జియో స్టూడియోస్‌ ఈ సినిమా కోసం స్టూడియో గ్రీన్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. జియో స్టూడియోస్‌ రాకతో మా సినిమా గ్లోబల్‌ ఆడియెన్స్‌కు మరింతగా రీచ్‌ అవుతుందని ఆశిస్తున్నాం. హీరో విక్రమ్‌ ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ఈ గ్లింప్స్‌ మీకు చూపిస్తుంది’ అని అన్నారు. ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలోనే అన్ని భారతీయ భాషల్లో వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Spread the love