రోడ్డుపై రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్‌ జామ్

నవతెలంగాణ – యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పంటలు పండిస్తే ప్రభుత్వం కోనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ఆగ్రహం చెందారు. కండ్ల ముందే పంటలు పాడవుతున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు రోడ్డుపైనే ధాన్యం పోసి తమ నిరసన తెలిపారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వలిగొండ మండలం రైతులు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి, రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారం రోజులైనా ధాన్యం కొంటలేరని రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కొనుగోళ్లు చేపట్టే వరకు ఆందోళన విరమించమని రైతులు స్పష్టం చేశారు.

Spread the love