ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడి..

నవతెలంగాణ – ఖమ్మం : ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌పై ఓ ఆటో డ్రైవర్‌ దాడికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆటోను పక్కకు జరపమన్నందుకు సదరు ఆటో డ్రైవర్‌ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. బస్సు అద్దాలను ధ్వంసం చేశాడు. ఆటో డ్రైవర్‌పై బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love