సత్తా చాటిన ఓపెన్‌ హైమర్‌

A powerful open hymerప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక సోమవారం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక ప్రారంభానికి ముందు అందాల తారలు రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. ఇక సినీ విశేష్లకులు, సినీ ప్రేమికులు ఊహించినట్టుగానే ‘ఓపెన్‌ హైమర్‌’ అత్యధిక అవార్డుల్ని కొల్లగొట్టింది. 11 నామినేషన్లతో బరిలోకి దిగిన ఈ సినిమా ఏకంగా 7 పురస్కారాలను దక్కించుకుని సత్తా చాటింది.
‘ఓపెన్‌ హైమర్‌’.. 96వ ఆస్కార్‌ అవార్డుల్లో 7 అవార్డులతో విజయకేతనం ఎగురవేసింది. క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన తొలి బయోపిక్‌ ఇది. దీన్ని ది ట్రయంఫ్‌ అండ్‌ ట్రాజెడీ ఆఫ్‌ జె రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్‌ అనే పుస్తకర ఆధారంగా తెరకెక్కించారు. విజువల్‌ వండర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం సినీ విశ్లేషకుల జోస్యాన్ని ప్రతిబింబించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ ఒరిజినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వంటి విభాగాల్లో ఆస్కార్‌ని కైవసం చేసుకుంది. అణుబాంబు సృష్టికర్త జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి ఇన్ని అవార్డులు రావడం ఈ ఏడాది చెప్పుకోదగ్గ ప్రత్యేక అంశం. దీని తర్వాత పూర్‌ థింక్స్‌ చిత్రం పలు విభాగాల్లో పురస్కారాలను దక్కించుకుని శభాష్‌ అనిపించుకుంది.
జిమ్మి కిమ్మెల్‌ 4వ సారి ఈ ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఓ విశేషమైతే, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇచ్చేందుకు వేదికపైకి నటుడు జాన్‌ సెనా న్యూడ్‌గా రావడం మరో విశేషం. ఇలాంటి సంఘటన ఇదే వేదికపై 1974లో జరిగింది.
మరో సారి నాటు నాటు సాంగ్‌..
గత ఏడాది నాటు నాటు పాటకు ఆస్కార్‌ని అందుకోవడంతోపాటు వేదికపై కూడా ప్రదర్శితమైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటు నాటు పాటను ఈ ఏడాది కూడా వేదికపై ప్రదర్శించడం మరో చెప్పుకోదగ్గ విశేషం. అయితే ‘బార్జీ’ చిత్రం కేవలం పాటకు అవార్డుని అందుకుని అందర్నీ నిశాపర్చింది.
96వ ఆస్కార్‌ అవార్డుల విజేతల వివరాలు
ఉత్తమ చిత్రం : ఓపెన్‌హైమర్‌
ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌)
ఉత్తమ నటుడు: కిలియన్‌ మర్ఫీ పెన్‌ హైమర్‌)
ఉత్తమ నటి : ఎమ్మాస్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)
త్త్తమ సహాయ నటుడు : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌ హైమర్‌)
ఉత్తమ సహాయ నటి : డేవైన్‌ జో రాండాల్స్‌ (ది హౌల్డోవర్స్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : హయోటి వాన్‌ హయోటోమా (ఓపెన్‌ హైమర్‌)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ : 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌
ఉత్తమ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌ : నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : కార్డ్‌ జెఫర్‌సన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ది బారు అండ్‌ ది హిరాన్‌
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ : హౌలి వెడ్డింగ్‌టనÊ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ : జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ : ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
బెస్ట్‌ ఎడిటింగ్‌ : జెన్నిఫర్‌ లేమ్‌ (ఓపెన్‌ హైమర్‌)
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : గాడ్జిల్లా మైనస్‌ వన్‌
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌) : ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : వార్‌ ఈజ్‌ ఓవర్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ : ఓపెన్‌ హైమర్‌
బెస్ట్‌ సౌండ్‌ : ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ : వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ ఫర్‌ (బార్బీ)
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ సుగర్‌

Spread the love