ఆద్యంతం వినోదాత్మకం

ఆద్యంతం
వినోదాత్మకంతెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు రావు రమేష్‌. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్‌… ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రావు రమేష్‌ కథానాయకుడిగా, టైటిల్‌ రోల్‌లో నటించిన సినిమా ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్‌ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్‌ కీలక పాత్రధారులు. పీబీఆర్‌ సినిమాస్‌, లోకమాత్రే సినిమాటిక్స్‌ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మాతలు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఈ రోజు సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. సాధారణంగా సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయించడం కామన్‌. ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’ టీమ్‌ కొత్తగా ఆలోచించింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయమని ప్రేక్షకుల్ని కోరింది. సినిమా ఇండిస్టీలో ఈ విధంగా క్యూఆర్‌ స్కానింగ్‌ ద్వారా లుక్‌ విడుదల చేయడం ఇదే తొలిసారి. ఫస్ట్‌ టైమ్‌ ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’ టీమ్‌ చేసిన కొత్త ప్రయత్నానికి సూపర్బ్‌ రెస్పాన్స్‌ లభించింది. ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ… ”ఇప్పటి వరకు రావు రమేష్‌ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఎంటర్‌టైన్‌ చేస్తారు. వినోదంతో పాటు భావోద్వేగాలు సైతం సినిమాలో ఉన్నాయి. ఫస్ట్‌ లుక్‌ విడుదల తర్వాత ఫెంటాస్టిక్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రావు రమేష్‌ గారి లుక్‌ చాలా బావుందని చెబుతున్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయమని మేం చేసిన విజ్ఞప్తికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదు. 50 వేల మందికి పైగా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేశారు. రావు రమేష్‌ గారి ప్రేక్షకులు చూపిస్తున్న ఈ అభిమానం మాకెంతో సంతోషం కలిగిస్తోంది. కుటుంబం అంతా కలిసి చూసేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది” అని చెప్పారు.

Spread the love