ఈవిఎంలను ట్యాంపరింగ్‌ చేస్తే?

ఈవిఎంలను ట్యాంపరింగ్‌ చేస్తే?కోమల్‌ కుమార్‌ హీరోగా, ఇండియన్‌ క్రికెటర్‌ శ్రీశాంత్‌ నెగిటివ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘యమధీర’. శ్రీమందిరం ప్రొడక్షన్స్‌లో వేదాల శ్రీనివాస్‌ నిర్మిస్తున్న తొలి చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ట్రెజరర్‌ రామ సత్యనారాయణ, నిర్మాత డి.ఎస్‌.రావు, పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ, ‘యమధీర టైటిల్‌ చాలా క్యాచీగా ఉంది. గతంలో యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఉంది. కోమల్‌ కుమార్‌ కూడా పోలీస్‌ ఆఫీసర్‌గా చాలా అద్భుతంగా నటించాడు. విజరు ‘సర్కార్‌’ మూవీ లాగే ఇది కూడా పొలిటికల్‌ డ్రామా. ఈవీఎంల ట్యాంపరింగ్‌, పోలింగ్‌ వాటి గురించి చాలా బాగా చూపించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు’ అని తెలిపారు.
‘ఈ చిత్రాన్ని ఈవీఎం ట్యాంపరింగ్‌ పైన చిత్రీకరించాం. అజర్‌ బైజాన్‌ కంట్రీలో ఎక్కువ శాతం చిత్రీకరణ చేశాం. 100 సినిమాల్లో నటించిన కోమల్‌ కుమార్‌చ, క్రికెటర్‌ శ్రీశాంత్‌ ముఖ్య పాత్రలో నటించారు. నాగబాబు, అలీ, సత్య ప్రకాష్‌, మధుసూదన్‌ ఇందులో ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకి సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని మంచి సక్సెస్‌ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని నిర్మాత వేదాల శ్రీనివాస్‌ రావు అన్నారు. ఈచిత్రానికి కెమెరామెన్‌ : రోష్‌ మోహన్‌ కార్తీక్‌, మాటలు – పాటలు : వరదరాజ్‌ చిక్కబళ్ళపుర, ఎడిటింగ్‌ : సి రవిచంద్రన్‌, సంగీతం : వరుణ్‌ ఉన్ని, కథ – దర్శకత్వం : శంకర్‌ ఆర్‌.

Spread the love