వీర ధీర శూరన్‌

వీర ధీర శూరన్‌హీరో విక్రమ్‌ పుట్టిన రోజు బుధవారం. ఈ సందర్భంగా మేకర్స్‌ ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 62వ చిత్రానికి సంబంధించి టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘వీర ధీర శూరన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటించనున్నారు. ఎస్‌.జె.సూర్య, దుసరా విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పక్కా మాస్‌ అవతార్‌లో విక్రమ్‌ అభిమానులను మెప్పించటం ఖాయంగా కనిపిస్తుంది. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: రియా శిబు, రచన-దర్శకత్వం: ఎస్‌.యు. అరుణ్‌కుమార్‌, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: రోని జకారియా.

Spread the love