తండ్రి కోసం కొడుకు పోరాటం

తండ్రి కోసం కొడుకు పోరాటంయూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌ పై హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న చిత్రం ‘భజే వాయు వేగం’. ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, హ్యాపీ డేస్‌ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను ‘విశ్వంభర’ సినిమా సెట్‌లో చిరంజీవి రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘టీజర్‌, టైటిల్‌ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. నా అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రశాంత్‌ రెడ్డి లాంటి యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ టాలీవుడ్‌కు రావాలి. ఈ టీజర్‌ చూస్తుంటే తండ్రీ కొడుకు మధ్య మంచి ఎమోషన్‌తో సాగే సినిమా అనిపిస్తోంది. యాక్షన్‌ బాగుంది’ అని తెలిపారు. ‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం, నా లైఫ్‌లో అది మా నాన్న అని కార్తికేయ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. ఫాదర్‌, సన్‌ ఎమోషన్‌, హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్సులు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. కార్తికేయ ఎనర్జిటిక్‌గా కనిపించారు. అన్ని ఎమోషన్స్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ‘భజే వాయు వేగం’ సినిమా రూపొందించినట్లు టీజర్‌తో తెలుస్తోంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ను త్వరలో అనౌన్స్‌ చేయబోతున్నారు.

Spread the love