మత సామరస్యానికి ప్రతిక రంజాన్ మంత్రి శ్రీధర్ బాబు

Sridar Babu – ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
నవతెలంగాణ:- మల్హర్ రావు.
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు.ఆదివారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని జామా మస్జిద్, మదీనా మసీదుల్లో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ముస్లిం సోదరులు శ్రీధర్ బాబును శాలువాతో ఘనంగా సత్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మంత్రికి నోరు తీపి చేశారు, అలాగే ముస్లిం సోదరులకు నోరు తీపిని మంత్రి చేశారు.అనంతరందుద్దిళ్ల మాట్లాడారు తన గెలుపుకు సహకరించిన ముస్లిం సోదర సోదరీమణులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.పార్లమెంటు ఎన్నికల దృశ్య ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మైనార్టీ సంక్షేమానికి సంబంధించిన అభివృద్ధి పనులను ఎన్నికల అనంతరం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని అందరూ సుఖ సంతోషాలతో గడుపుకోవాలని ముందస్తుగా ప్రతి ఒక్క ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love