ఓన్లీ రెగ్యులర్ టు సర్వీస్ కావాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్రంలో 12 యూనివర్సిటీలో రాష్ట్ర జాక్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ల సంఘం అధ్యక్షులు దత్తాహరి మాట్లాడుతూ తమకు ఓన్లీ రెగ్యులర్ టు సర్వీస్ కల్పించాలని, మా న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం పరిష్కరించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి మా ఆవేదనను ఆర్జీ రూపంలో స్వీకరించి అతి తొందరలోనే మాకు గుడ్ న్యూస్ తెలియజేస్తుందని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లు ఆశిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కూడా రెగ్యులరైజ్ టు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఓన్లీ స్లొగన్స్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.12 యూనివర్సిటీలలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ 1335 మందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డాక్టర్ వి దత్తాహరి కోరారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ కి న్యాయం చేస్తుందని ఎన్నో ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉంటూ కష్టం వచ్చిన దాన్ని మనోధైర్యం తో ఎదుర్కొంటు మంచి విద్యా బోధన చేస్తున్నామన్నమని వివరించారు.
బుధవారం యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు నిరసనను వినూత్నంగా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ శరత్, డాక్టర్ గోపిరాజ్, డాక్టర్ బి.ఆర్ నేత, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, డాక్టర్ గంగ కిషన్, డాక్టర్ డానియల్, డాక్టర్ సురేష్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ దేవరాజ్ శ్రీనివాస్, డాక్టర్ జలంధర్, సందీప్ ,రాజేశ్వర్, పురుషోత్తం, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ ఆనంద్ ,డాక్టర్ నరసింహులు ,డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్ జి శ్రీనివాస్, తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Spread the love