నవతెలంగాణ – బచ్చన్నపేట
మండలంలోని బస్సు రెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ బాలగోని పరశరాములు 15 రోజులుగా హాస్పటల్లో మృతులతో పోరాడుతూ ఈరోజు మరణించగా ఆయన భౌతిక కాయాన్ని మండల జర్నలిస్టులు హాజరై ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తేలుకంటి మురళి, గౌరవ అధ్యక్షుడు ముసిని వీరయ్య గౌడ్ప్ర,ధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యక్షులు తెలుకంటి శ్రీనివాస్, రెడ్డబోయిన హరికుమార్,మంచాల సంతోష్ కుమార్,సహాయ కార్యదర్శిలు జంగిలి బిక్షపతి,మల్యాల బాల్ నరసయ్య,సందేల బాలసిద్దులు, కోశాధికారి, గంట తిరుమల్ రెడ్డి,కార్య వర్గ సభ్యులు గర్నేపల్లి కర్ణాకార్,తాటి చెట్టు భాస్కర్ పంబాల మల్లేశం, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఉన్నారు.