బస్సు పాస్ లను అందించిన ప్రిన్సిపాల్..

నవతెలంగాణ- ధర్మసాగర్
20 మంది విద్యార్థులకు బస్సు పాసుల ఖర్చులను అందించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాల శ్రీనివాస్. ఈ రోజు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆయన జన్మదిన సందర్భంగా అధ్యాపకులు విద్యార్థుల కేకును కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ గ్రామాల నుండి కళాశాలకు వచ్చే విద్యార్థిని విద్యార్థులకు 20 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love