పిల్లల్ని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

నవతెలంగాణn – ధర్మసాగర్
నా ఇద్దరి కుమారులను గొర్రె రిషి(11), గొర్రె రిత్విక్(10) పథకం ప్రకారం కక్షపూరితంగా చంపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని, చట్టపరంగా శిక్షించాలని గొర్రె నిహారిక ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ ఒంటేరు రమేష్ గారికి గత నెల 25వ తేదీన మండలంలోని విలీన గ్రామమైన రాంపూర్ చెరువులో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరి చిన్నారుల విషయం విధితమే. ఈ సంఘటనపై సరియైన విచారణ చేపట్టి నేరస్తులను చట్ట ప్రకారం శిక్షించాలని ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రింట్ మీడియా అసోసియేషన్ ధర్మసాగర్ లో ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎలుకుతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె సుమన్ నన్ను గత 11 సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. మా అన్యోన్య దాంపత్యంలో ఇద్దరు కుమారులు రిషి, రిత్విక్ తో సంతానంతో పది సంవత్సరాలు అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడిపామని తెలిపారు. ఈ క్రమంలో నా భర్త సెల్ ఫోన్లు లో ఒకరితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్న ఫోటో వీడియోలను చూసి తనను నిలదీయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో మా ఐదుగురు ఆడపడుచులు,నా కులం డక్కలి అని తెలిసుకొని, నాపై ఈర్ష ద్వేషాలను నా భర్తలో రేకెత్తించి నన్ను నానా చిత్రహింసలు పెట్టే విధంగా తయారు చేశారని ఆరోపించారు. దీంతో నా భర్త విరాకులు ఇవ్వమని తీవ్రంగా హింసిస్తూ కత్తితో చంపేందుకు పూనుకోవడంతో నేను నా పిల్లలతో గత సంవత్సరం క్రిందట మా తల్లిగారు గ్రామమైన అంకుషాపురం గ్రామంలో సంవత్సరం పాటు తల దాచుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో ఆయన అప్పుడప్పుడు నా వద్దకు వస్తూ, వెళ్లేవాడని తెలిపారు. ఈ క్రమంలో రాంపూర్ గ్రామానికి చెందిన మా నాల్గవ ఆడపడుచు మునియాల రజిత పెద్ద కుమార్తె వివాహం మే 24న ఉన్నదని, నేను నిన్ను ఏమనను నాకున్న అయిదు ఎకరాల వ్యవసాయ భూమిని, ఎలకతోర్తి గ్రామంలో ఉన్న మూడు ప్లాట్లను, దామెర గ్రామంలో ఉన్న ఇంటి స్థలాన్ని నీపైన మన కుమారుల పైన రాసి ఇస్తానని నమ్మించి, తన వెంట దామెర గ్రామానికి తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. మే 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు వివాహానికి హాజరై 25వ తేదీన ఉదయం 6 గంటలకు చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో దామెర గ్రామానికి వెళ్దామని నా కుమారులను స్నానం చేయించి, నేను కూడా తయారై వెళ్దామని నా భర్తకు పురమాయించగా అతను పెళ్లి లెక్కలు ఉన్నాయి, లెక్కలు అయిన తర్వాత వెళ్దామని నమ్మబలికారు. దీంతో పథకం ప్రకారం మా ఆడపడుచులు మత్తుమందు కలిపిన చాయ్ (టీ) నాకు సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఇవ్వగా సాయంత్రం నాలుగు గంటల వరకు నేను గాడ నిద్ర నిన్నటినమైపోయానని వాపోయారు. ఈ క్రమంలో నా భర్త, ఐదుగురు ఆడపడుచులు, వారి భర్తలు, వారి కుమారులు, అల్లుండ్లు పథకం ప్రకారం నా ఇద్దరి కుమారులను రాంపూర్ చెరువులో పడి చనిపోయినట్లు పథకం సృష్టించడం జరిగిందని కన్నీళ్లపర్వతం అయ్యారు. నా ఇద్దరు కుమారులు ఉంటే ఆస్తికి వారసులుగా ఉంటారని, వారి ఈ ఘోర పాపానికి ఒడి కట్టడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా నాకు, నా తల్లి గారికి వారందరితో ప్రాణహాని ఉందని వారు ఆస్తి కోసం ఎంతటికైనా తెగిస్తారని, నాకు రక్షణ కల్పిస్తూ, పైన తెలిపిన వారందరిపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని మీ ముందుకు రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Spread the love