నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని వెంగల్ పాడ్ తాండలో శ్రీ జగదంబ మాత సేవాలాల్ మహారాజ్ అలయంలో బుధవారం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమానికి టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి, ఆలయాలు, కమ్యూనిటీ హాల్లు, సీసీ రోడ్లకు 64 కోట్ల రూపాయల నిధులను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. సిజిఎఫ్ ల్యాండ్స్ నిధులనుండి 70 దేవాలయల నిర్మాణం చేసుకోవడం జరిగిందని, నిజామాబాద్ జిల్లాలోనే మనమే అగ్రస్థానంలో ఉన్నమన్నారు. ఇప్పటివరకు రూరల్ నియోజకవర్గం లో చాలా అభివృద్ధి పనులు చేసుకున్నామని, మరిన్ని నిధుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ని అడగడం జరిగిందని, అ నిధులు మంజూరు చేయగానే, వెంగల్ పాడ్ గ్రామానికి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. స్వతంత్రం వచ్చి 75ఏళ్ళు అవుతున్న గతంలో గిరిజనులు ఆవులను కాస్తూ,జీవనం సాగిస్తుడే వారని, అప్పుడు రామారావు మహారాజు యొక్క సందేశాలతో ప్రజలను చైతన్యవంతం చేశారని వివరించారు.అనాటి నుండి వారి జీవన మనుగడ నే మార్చేశారన్నారు, ఇప్పుడు గిరిజనులు, ఆర్థికంగా ఎదుగుతూ రాజకీయాల్లో, విద్యాపరంగా, అనేక రంగాల్లో గిరిజనులు ముందున్నారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి ప్రభుత్వం, మతాన్ని అడ్డం పెట్టుకుంటూ రాజకీయం సాగిస్తుందని, మన దేశాన్ని పాలించే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఇలా ప్రతి దానిలో ఇంత మంది హిందువులు మన దేశాన్ని పాలించగా, అలాంటప్పుడు మతాలని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం ఎందుకని ప్రశ్నించారు. చేతకానితనం తప్ప వీరి వల్ల మన దేశానికి, రాష్ట్రాలకు నష్టం తప్ప లాభం కొంచెం కూడా లేదని దుయ్యబట్టారు.ఇంతకుముందు మన దేశాన్ని ఇతర మతస్తులు కూడా పాలించారని, కానీ ఇలాంటి మత రాజకీయాలు చేయలేదని, ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు మోసపూరితమైన రాజకీయాలు చేయడం బిజెపి వాళ్ళ తత్వమని, వీరిని ప్రజలు నమ్మవద్దని, విరిని నమ్మితే మోసపోయేది మనమేనన్నారు. ప్రజలందరూ ఈ విషయాల్ని గమనించాలని, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపగడపకు ప్రతి ఇంటికి సంక్షేమం ఫలాలను అందించారని కొనియాడారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కు వెన్నంటే ఉంటూ, రాబోయే రోజుల్లో కేసీఆర్ ని మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని తాండాలను మరింత అభివృద్ధి చేసుకుందాని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, చైర్మన్ సూర్య నాయక్, సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ సుమిత్ర చందర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, రాములు నాయక్, మహిపాల్ నాయక్,
బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చింతల దాస్, పాశం కుమార్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.