ముస్లిం స్మశాన వాటిక సమద్దుల్లో మురుగు నీరు..

– తక్షణమే డ్రైనేజీ పనులను ప్రారంభించాలి..
– ఎంపిపి రమేష్ నాయక్,టోల్ ప్లాజా అధికారుల పరిశీలన..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని ముస్లిం స్మశాన వాటిక వరకే రాహదరి విస్తరణ చేసినప్పుడు డ్రైనేజీ ని వదిలి వేయడంతో ముస్లిం సోదరులు ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీప  బాదవత్ రమేష్ నాయక్ దృష్టికి, టోల్ ప్లాజా అధికారుల కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గతంలో అందజేశారు.దానిలో భాగంగానే గురువారం ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, ఎంపిటిసి చింతల దాస్, హైవే మేనేజర్ గౌరీ నాయుడు, కో-ఆప్షన్ సభ్యులు షేక్ హుస్సేన్, ముస్లిం మండల కమిటీ అధ్యక్షులు హబిబ్, మస్ జీద్ కమిటీ అధ్యక్షులు ఖాజామియ్య ముస్లిం కమిటీ ప్రతినిధులు స్మశాన వాటిక వద్దకు సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ముస్లిం కమిటీ సభ్యులు మాట్లాడుతూ రహదారి 44 విస్తరణ సమయంలో సర్విస్ రోడ్డు పక్కన డ్రైనేజీ నిర్మాణం చేపట్టి స్మశాన వాటిక వద్దనే వదిలి వేయడంతో మురికి నీరు ఒక్క చోట చేరి పక్క నుండి ముస్లిం ల పూర్వికుల సమాధుల్లో చేరుతున్నారని వారు వివరించారు.ఈ సమస్యలను పరిష్కరించాలని గతంలో నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ నిర్మల్ కు వినతి పత్రాన్ని పలుమార్లు అందజేసిన పట్టించుకో లేదని వారన్నారు.ఇదే విషయమై ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే టోల్ ప్లాజా అధికారులకు డ్రైనేజీ నిర్మాణం త్వరగా చేపట్టేలా చుడాలని ఆదేశించినట్లు ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ సర్విస్ రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ పనులు సగంలో వదిలేయడం వలన మురికి నీరు ప్రజలను, సముద్రుడు లో చేరి అనారోగ్యానికి, ఇబ్బందులకు గురి చేస్తుందని దీనిని తక్షణమే శుభ్రం చేసి పనులు ప్రారంభించి పక్కన వెళుతున్న కాలువలో వదిలేయాలని ఎంపీపీ రమేష్ నాయక్ హైవే మేనేజర్ గౌరీ నాయుడుకి మర్యాదపూర్వకంగా విన్నవించారు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆదేశాల మేరకు ఈ డ్రైనేజీ పనులను తక్షణమే ప్రారంభించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ఇదే విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు మేనేజర్ నిర్మల్ కు సమాచారాన్ని అందించి  పనులను ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేయలో హైవే మేనేజర్కు చూపించడం జరిగిందని ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ వివరించారు. ఇదే కాకుండా సర్విస్ రోడ్డు కి ఇరువైపుల డ్రైనేజీలో కురుకు పోయిన చేత్త చేదరంను తోలగించే విధంగా చూడాలని ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు షేక్ కరీం, మైనారిటీ యూత్ అధ్యక్షులు షేక్ మోసిన్, టోల్ ప్లాజా అధికారులు తదితరులు ఉన్నారు.
Spread the love