తృటిలో తప్పిన పేను ప్రమాదం..

– పశువు మృతి..  ఒకరికి గాయాలు
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇండల్ వాయి  మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 బస్టాండ్ వద్ద బ్రిడ్జి పై బోధన్ నుండి హైదరాబాద్ కు కారులో ముగ్గురు వేళ్తుండగ రాహదరి పై అకస్మాత్తుగా పశువు రావడంతో  కారు అదుపు చేస్తూ పశువుని ఢీ కోనడంతో అది అక్కడికక్కడే మృతిచెందగా  కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి లో ఒకరికి  గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగులు తేరుచు కోవడం,వేగం ను నియంత్రించు కోవడం వల్ల ఎటువంటి ప్రాణానష్టం జరగలేదని వారన్నారు.ఎస్ ఐ నరేష్ పోలిస్ సిబ్బంది, టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది చేరుకుని ట్రాఫిక్ ను ఆగకుండా చేశారు.ఈ ప్రమాదంలో కారుకు తివ్ర నష్టం వాటిల్లిందని పలువురు పేర్కొన్నారు. క్రేన్ ను రప్పించి పశువును,కారును రాహదరిపై నుండి తోలగించినట్లు ఎస్ ఐ నరేష్ వివరించారు.
Spread the love