ప్రశాంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదు…

నవతెలంగాణ-ఏర్గట్ల
మండలకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సోమవారం పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పూర్ణానందం మాట్లాడుతూ…బీజేపీ బాల్కొండ స్వయం ప్రకటిత ఎమ్మెల్యే అభ్యర్థి మల్లికార్జున్ రెడ్డి నియోజవర్గంలో సమస్యలే లేనట్లు పదే పదే బట్టాపూర్ క్రషర్ విషయాన్నే మాట్లాడుతున్నారని,క్రషర్ మిషన్ లు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేవా అని ప్రశ్నించారు.మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారని,చేతనైతే కేంద్రంలో మీ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కదా నిధులు తెచ్చి ఏర్గట్ల మండలాన్ని అభివృద్ధి పరచాలని  కోరుతున్నానన్నారు.1985-86 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏర్గట్లను మండలంగా ప్రకటిస్తే అడ్డుపడ్డది మీ నాన్న మహిపాల్ రెడ్డి కాదా అని అడుగుతున్నానన్నారు.ఆ సమయంలో ఏర్గట్ల గ్రామంలోకి రానీయకుండా మీ నాన్నను ఎలాగైతే అడ్డుకున్నారో నీకు అదే గతి పడుతుందని విమర్శించారు.ప్రశాంత్ రెడ్డిపై,ఆయన బంధువులపై ఉన్న విద్వేషాన్ని కంకర మిషన్ రూపంలో వెళ్ళగక్కుతున్నట్లు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.క్రషర్ మిషన్ లో ఏమైనా అవినీతి జరిగితే సంబంధిత శాఖ అధికారులకు తెలపాలని,మిషన్ ఇక్కడి నుండి పోతే,ఇంటి నిర్మాణానికి ప్రజలు వేరే ప్రాంతం నుండి కంకర తెచ్చుకుంటే ప్రజలకు ఎక్కువ ఖర్చు అవుతుందని అన్నారు.ఏర్గట్ల ప్రజలు చైతన్య వంతులని,వారికి ఏది నిజం,ఏది కల్లనో తెలుసని,మంత్రిపై నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని హితువు పలికారు.జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్ మాట్లాడుతూ… మల్లికార్జున్ రెడ్డికి ఏమి పనిలేకపోతే, ఏదైనా పని వెతుక్కుని చేసుకోవాలని,వార్డ్ మెంబర్ గా కూడా గెలవని అతను మంత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఏంటని అన్నారు.నీవు మంత్రిపై ఒక్కటి మాట్లాడితే,మేము నీపై లక్ష మాట్లాడుతామన్నారు.ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడేంత స్థాయి నీకు లేదని విమర్శించారు. నీకు అంతలా మాట్లాడాలని ఉంటే ఏర్గట్ల స్థూపం వద్ద డిబేట్ పెట్టుకుందాం రా…అని మల్లికార్జున్ రెడ్డికి సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జక్కని మధుసూదన్,సర్పంచ్లు పత్తిరెడ్డి ప్రకాష్,కుండ నవీన్, ఏర్గట్ల పిఏసీఎస్ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య,వైస్ చైర్మన్ సిగసారం గంగారాం,నాయకులు నెరేళ్ళ లింగారెడ్డి,బద్దం శ్రీనివాస్ రెడ్డి,కట్కం సాగర్,సామంత్ రెడ్డి,వేశాల నర్సారెడ్డి,ఆకుల రాజేంధర్,నర్ర అశోక్,కూతురు సాయన్న,మురళి రాంపెల్లి,చిల్క కిషన్,మూడ్ గంగారాం,గన్నారపు రాజేశ్వర్,కూశ లింబాద్రి,తోకల ఈశ్వర్, భీమ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love