– గోదావరిలో ఆత్మహత్యకు ప్రయత్నించి..
నవ తెలంగాణ- నవీపేట్ :కల్తీ కల్లుకు బానిసై కల్లు తాగినందుకు డబ్బులు లేకపోవడంతో మనస్థాపం చెంది గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన సంఘటన బాసర గోదావరి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ దుబ్బా గల్లీలో ఉంటున్న రాజేష్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు కల్తీ కల్లుకు బానిసై డబ్బులు లేకపోవడంతో రక్తదానం చేసి డబ్బులు తీసుకుని కల్తీ కల్లు తాగేవాడు డబ్బుల కోసం ఇంట్లో వేధిస్తూ ఉండడం తో డబ్బులు లేవని చెప్పడంతో మనస్థాపకమించింది శుక్రవారం గోదావరిలో దూకేందుకు వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా బాసర టెంపుల్ లో ప్లంబర్ గా పనిచేస్తున్న యంచ యువకుడు సిందే రాజు అతని కాపాడి యంచ గ్రామానికి తీసుకువచ్చాడు. యువకుడి తల్లిదండ్రులు మండల కేంద్రంలోని తడగం గ్రామానికి చెందిన ఐలాపురం గంగాధర్, రుక్మిణి లు గత కొంతకాలంగా నిజామాబాదులో నివసిస్తున్నారు.