ఒబిసి గుర్తింపుకై జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కు వినతి

నవతెలంగాణ -నవీపేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గుర్తించిన 17 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ ఓ బి సి కమిషన్ చైర్మన్ డాక్టర్ హంసరాజ్ అహీర్ కు హైదరాబాదులోని హరిత ప్లాజాలో కలిసి గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కేంద్ర జాబితా ఓబీసీలో లేకపోవడం వలన విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందులను ఓబీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ బీసీ కమిషన్ ఇచ్చిన నలభై కులాల జాబితాను స్వీకరించి త్వరితగతిన ఓబీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులతోపాటు మోహన్ చవాన్, ప్రవీణ్, వేదాకర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love