అధునాతన మానేరు రివర్ ఫ్రంట్‌ నిర్మాణమే మా లక్ష్యం : గంగుల కమలాకర్

నవతెలంగాణ హైదరాబాద్:  గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ కన్నా అధునాతనమైన మానేరు రివర్ ఫ్రంట్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్‌ను ప్రపంచంలోనే అధునాతన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. మొదటి దశలో 3.5 కిలోమీటర్లు, రెండో దశలో 6.25 కిలోమీటర్లు మొత్తం 10 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జితో మానేరు రివర్ ఫ్రంట్‌కి సరికొత్త శోభ వచ్చిందని, ఎంఆర్ఎఫ్ లో భాగంగా ఇప్పటికే బిగ్ ఓ ఫౌంటెన్ వర్క్ ప్రారంభమైందని, ప్రస్తుతం 410 కోట్లతో పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

Spread the love