ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ సమావేశం…

నవతెలంగాణ – అమరావతి
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షత క్యాబినెట్ సమావేశం ప్రారంభమయింది. సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ లో ఉన్న క్యాబినెట్ మీటింగ్ హాల్లో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలును ఆమోదించనున్నారు. గ్రూప్ 1, 2 పోస్టులు, ఈ ఏడాది విద్యా కానుక పంపిణీకి ఆమోదం తెలపనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ బదులు జీపీఎస్ అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Spread the love