సింగరేణినీ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం : డిప్యూటీ సిఎం భట్టి

నవతెలంగాణ – హైదరాబాద్‌: సింగరేణి నీ కాపడుతాం.. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్‌ జన జాతర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూసివేసిన, కాలం చెల్లిన ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌లను అందుబాటు లోకి తీసుకుని వస్తామన్నారు. ఫాం హౌస్‌ కి వెళ్లి వచ్చిన కేసీఆర్‌ పదేళ్లు మొద్దు నిద్ర పోయారన్నారు. సింగరేణి నీ కాపడుతాం.. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా ఇస్తున్నామన్నారు. కొత్తగూడెం స్పాంజ్‌ ఐరన్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. రిజర్వేషన్‌ తొలగించడానికి బీజేపీ చేసిన ప్రయత్నం గురించే సీఎం రేవంత్‌ చెప్పారన్నారు. రేవంత్‌ రెడ్డి పై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో ఆఫ్ట్రాల్‌ మీరు ఢిల్లీకి పిలిపిస్తే మేము భయపడతామా? అన్నారు. తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు

Spread the love