భూత్పూర్‌లో మున్సిపల్‌ పార్కు, ఓపెన్‌ జిమ్‌లను ప్రారంభించిన కేటీఆర్

నవతెలంగాణ మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌లో మున్సిపల్‌ పార్కు, ఓపెన్‌ జిమ్‌లను ప్రారంభించారు. అనంతరం మూసాపేట మండలం వేముల, మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో భూత్పూర్‌ చేరుకున్న మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డిలకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముసాపేట మండలం వేములలోని ప్రయివేటు కంపెనీ యూనిట్‌కు, మైక్రో రూరల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మణానికి, మహబూబ్‌నగర్‌లోని బాలికల ఐటీఐలో శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలోని ఎర్రగుట్టలో డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Spread the love