పెరిగిన వేతనాలు చెల్లింపు

నవతెలంగాణ – సింగరేణి ప్రతినిధి
బొగ్గు గని కార్మికులకు  11వ వేతన ఒప్పందం ప్రకారం పెరిగిన  జీతభత్యాలను అమలు చేయడానికి సింగరేణి యాజమాన్యం  గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. జూన్ నెల జీతాన్ని పెరిగిన వేతనాలతో జూలైలో చెల్లించాలని నిర్ణయించినట్లు సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. బేసిక్, డి ఏ, వి డి ఏ, అటెండెన్స్ బోనస్ ను జూలై 2021 నుండి అమలు చేయడానికి, జూన్ 2023 నుండి మిగతా అలవెన్స్ చెల్లించడానికి నిర్ణయించారు. ఒకటవ కేటగిరి కార్మికులకు  నెలరోజుల కనీస వేతనం  ₹43677-90 పైసలు లభిస్తుంది. రోజుకు ₹1679- 90 పైసలు లభిస్తుందని పేర్కొన్నారు. పెరిగిన వేతనాల చెల్లింపుపై కార్మికుల్లో నెలకొన్న గందరగోళాన్ని దూరం చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండే శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
Spread the love