– లైసెన్సు కలిగి ఉన్న దుకాణాలు కొనుగోలు చేయాలి
– రసీదులు తప్పకుండా తీసుకోవాలి
నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం టాస్క్ ఫోర్స్ అధికారులు
నవతెలంగాణ – మద్నూర్
విత్తన అమ్మకాల దుకాణాలను టాస్క్ ఫోర్స్ అధికారులు మద్నూర్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ఆకస్మిక తనిఖీలను చేపట్టారు
ఈ తనిఖీలు భాగంగా టాస్క్ ఫోర్స్ అధికారులు దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ముఖ్యంగా విత్తన డీలర్లు విత్తనాలను ఎక్కడి నుంచి తెచ్చారు , ఏ ఏ కంపెనీ విత్తనాలు తెచ్చారు అనేది డాక్యుమెంట్ ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ తనిఖీల్లో బాన్సువాడ ఏడిఏ వినయ కుమార్ విత్తన డీలర్లకు పలు సూచనలు తెలియజేశారు. ప్రతి డీలర్ లైసెన్స్ కాపీ, స్టాక్ బోర్డ్, బిల్ బుక్ ,పిసి లు తప్పకుండా ఉండాలని తెలియజేశారు. అలాగే రైతులకు ఏది అమ్మిన రసీదు తప్పకుండా ఇవ్వాలి అని సూచించారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనాలని, బయట రాష్ట్రం విత్తనాలు తీసుకొని చేయకూడదని అలాంటి విత్తనాలతో మోసపోవద్దని సూచించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బాన్సువాడ ఏవో సుధాకర్ మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు పాల్గొన్నారు.