ఈనెల 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు

నవతెలంగాణ – కంటేశ్వర్
మార్చి 2023 లో జిపిఏ 7.0 కంటే ఎక్కువ పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ (SC/ST/BC & MW) చెందిన విద్యార్థులు ఈ విద్యాసంవత్సరము 2023 2024 కార్పోరేట్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరములో ప్రవేశమునకు గాను తదుపరి ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ నిచ్చుటకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయడానికి తేది: 3-06-2023 నుండి 11-06-2023 వరకు ఆన్లైన్ నందు ధరఖాస్తు చేసుకోవలసిందిగా కమీషనరు, షెడ్యూల్డ్ కులాల. అభివృద్ధి శాఖ, హైదరాబాద్ వారు తెలిపారని నిజామాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సోమవారం ప్రకటనలో తెలిపారు. కావున ఇది వరకు నమోదు చేసుకొని విద్యార్థిని విద్యార్థులు నమోదు చేసుకొనుటకు గాను అర్హత గల యస్సీ, యస్.టి, బి.సి. మరియు మైనారిటీకి చెందిన విద్యార్థులు ఆన్లైన్ వెబ్సైట్లో http://telanganaepass.cgg.gov.in తేది: 3-06-2023 నుండి 11-06-2023 వరకు పొడిగించనైనది ఎంపికైన విద్యార్థులకు వారి యొక్క మొబైల్ఫోన్కు సమచారము ఇవ్వబడును. ఎంపికైన విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తము సంబంధిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ (SC/ST/BC & MW) కార్యాలయములో తేది: 16-06-2023 & 17-06-2023 హాజరుకాగలరు.

Spread the love