మేడారం మహా జాతరను పగడ్బందీగా నిర్వహించాలి

– గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ 
– వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ -తాడ్వాయి
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 21 2024 నుండి 24 ఫిబ్రవరి వరకు జరుగు మేడారం మహా జాతరను గత జాతరలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించి, పగడ్బందీగా  నిర్వహించాలని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం పోడు భూముల పట్టాలు పంపిణీ అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో వచ్చే ఏడాది జరుగు సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా మేడారం జాతర వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ 2024 లో వచ్చు మేడారం మహా జాతరకు వివిధ శాఖల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కు శాఖల వారీగా అంచనాలతో  చేపట్టవలసిన పనులపై సమీక్షించారు. గతంలో జరిగిన జాతర్ల కంటే ఈసారి జరిగే మహా జాతర మహా వైభవంగా జరగాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని తెలిపారు. అనంతరం మేడారంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎండోమెంట్ అధికారులు పూజారులు శాలువాలు కప్పి మనదేవతల ప్రసాదం అందించి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి, ఐటిడిఏ పీ ఓ అంకిత్, ఓఎస్ డి అశోక్ కుమార్, గ్రంధాలయ చైర్మన్ గోవింద్ నాయక్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య,  మహబూబాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యుడు అజ్మీరా సీతారాం నాయక్, మేడారం  శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ పూజారి జగ్గారావు,   జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, డిపిఓ వెంకయ్య,  ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేష్,  పంచాయతీరాజ్ ఈ ఈ దిలీప్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత, పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, జిల్లా సహకార అధికారి సర్దార్  సింగ్, డిప్యూటీ డైరెక్టర్ (టిడబ్ల్యు) ఐటిడిఎ పోచం, డి డబ్లూ ఓ ప్రేమలత, ఎన్పీడీసీఎల్ డిఇ పులుసం నాగేశ్వరావు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love