నాలేశ్వర్ లిఫ్ట్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ..

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని నాలేశ్వర్ లిఫ్టు ఎన్నికలకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు ఎన్నికల అధికారి మురళి శుక్రవారం తెలిపారు.మూడు రోజులపాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపారు. 20వ తేదీ స్కూటీని, 21వ తేదీ విత్ డ్రా, 26వ తేదీ ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు 11 నామినేషన్ లు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ద్యాగ సరీన్, సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు, కార్యదర్శి ఖలేషా ఉన్నారు.

Spread the love