పదిలో మెరిసిన విద్యార్థులకు సన్మానం

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తునికి వేణు మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకొని పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానించడం జరిగిందని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, పంచాయతీ కార్యదర్శి సదాశివ్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love