యూనివర్సిటీని ప్రక్షాళన చేయండి..

–  విద్యా శాఖ మంత్రికి వినతి
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ సమాజానికి ఆదర్శంగా వుండే యూనివర్సిటీలు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వున్నాయన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు, యూనివర్సిటీ భవిష్యత్తును ప్రమాదకరంగా మార్చిందన్నారు. రిజిస్ట్రార్ నియామకంలో తన మాటే చెల్లుబాటు కావాలనే దుర్బుద్ధితో, ఈసీ నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా వ్యవహరి స్తున్నారని తెలిపారు. తన అవినీతి, అక్రమాలకు వంతపాడే వారిని రిజిస్ట్రార్ లుగా నియమించుకొని వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం పేరుతో వున్న, యూనివర్సిటీని వెంటనే ప్రక్షాళన చేయాలని, సమాజంలో యూనివర్సిటీలపై ఉన్న నమ్మకాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రైమాన్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love