రసాభాసగా సర్వసభ్య సమావేశం

– యాసంగి పంటలో నష్ట పోయిన రైతుల వివరాలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ లో నమోదు చేయలేదని ఏవో ని ప్రశ్నించిన సర్పంచులు, ఎంపీటీసీలు
– చికోడ్ ఫారెస్ట్ ఏరియా కబ్జా గురవుతున్న అధికారులు పట్టింపు లేదు
– సభలో సమస్యను విన్నవిస్తే ఫారెస్ట్ ఆఫీసర్ పొంతనలేని సమాధానం
– అటవీ హద్దులు తొలుగుతున్న నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు
– సభలో ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడిన తీరుపై మండిపడ్డ ఎంపీటీసీ రాం రెడ్డి,తిమ్మాపూర్ ఎంపీటీసీ మహిళ సభ్యురాలు
– సంభాషణ తీరు మార్చుకోవాలని ఆదేశించి ఎంపీపీ, ఎంపీడీఓ
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఇటీవల యాసంగి పంట నష్టపోయిన రైతుల జాబితా గ్రామ పంచాయతీల ఇవ్వాలని, చికోడ్ గ్రామంలో ఫారెస్ట్ ఏరియా హద్దులను మార్చి అవసరం ఉన్న వారికే కేటాయిస్తూ …నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మండల సర్వ సభ సమావేశంలో అధికారులపై ఎంపీటీసీలు ,పలు గ్రామాల సర్పంచులు మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల సర్వ సభ ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో తొలుత ప్రజా ప్రతినిధులు వారి సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం యాసంగి పంటలో నష్ట పోయిన రైతుల వివరాలు ఇవ్వాలని, నష్టపరిహారం ఎప్పుడు అందుతుందని, ఇక గ్రామ పంచాయతీలో ఏఈవోల ద్వారా రైతుల వివరాలు ఎందుకు నమోదు చేయించలేదని సభలో పోతారం సర్పంచులు గడీల జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్, గుండా శంకర్, ఎంపీటీసీ రాం రెడ్డి లు వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్ ని ప్రశ్నించారు. అనంతరం రైతులకు ఖరీఫ్ సీజన్లో ఏఏ పంటలను వేసుకోవాలో రైతులకు అవగాహన చేస్తున్నారా లేదా అని నిలదీశారు.ప్రయివేట్ ఫర్టిలైజర్ షాపుల్లో జైశ్రీరాం విత్తనాలు ఒక బ్యాగ్ గజ్వేల్ లో 700 రూ.. ఉంటే దుబ్బాకలో 950 రూ.. లకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని,అలాంటి వారిని గుర్తించి అధికారులు లైసెన్స్ రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఆ విషయానికి ఏవో తమకు ఏలాంటి అధికారం లేదని సభలో చెప్పడం చర్చనీయం అయ్యింది. మార్కెట్ లో జనుము, పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. తదితరి మండల విద్యాధికారి సభలో ప్రస్తుతం బడిబాట కార్యక్రమం గ్రామ గ్రామనా నిర్వహిస్తున్నామన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో 25 పాఠశాలలు ఎంపికైతే తొలుత పద్మనాభునిపల్లి గ్రామ మండల పరిషత్ ఉన్నత పాఠశాల పనులు పూర్తయి ప్రారంభించామని తెలిపారు.ఇకపోతారం ,చెల్లపూర్,ఆకారంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు అందుకు ఆయా గ్రామాల సర్పంచులు సహకారం కావాలని కోరారు. ఎనగుర్తిలో 110 మంది విద్యార్థులు సరిపడా ఉపాధ్యాయ సిబ్బందికి లేక కొరతను ఎదుర్కొంటున్నామని వెంటనే ఆ సమస్య తీర్చాలని సర్పంచ్ గుండా శంకర్ ఎంఈవో ని అడగగా ఇప్పటికే నివేదికను జిల్లా అధికారికి పంపామని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోని టీచర్లు త్వరలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కొరత ఇలాగే ఉంటే విద్యార్థుల భవిష్యత్ నష్టపోతారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం చికోడ్ గ్రామంలో ఫారెస్ట్ ఏరియా కబ్జా గురవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని,అసలు ఫారెస్ట్ ఆఫీసర్ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఆఫీసులో కూర్చుని పనులు సాగిస్తున్నారని చికోడ్ ఎంపీటీసీ రాం రెడ్డి ఫారెస్ట్ అధికారి స్నేహాలత పై మండిపడ్డారు. 2000 వేల హెక్టారులు ఉన్న ఫారెస్ట్ స్థలాన్ని 261 గా ఉందని సభలో ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పడం వారిగమనార్హం.వన్య ప్రాణులు తాగడానికి వేసిన బోర్లు పాడైతే ఫారెస్ట్ లోని వాటిని పట్టించుకోకపోవడంతో అక్కడున్న జీవాలు దప్పిక కోసం బయటకు పరుగులు తీస్తున్నాయి. ఈ సమస్యను అధికారులు పట్టించుకోకుండా మార్కెట్ లో మాంసం కొనుగోలు చేసుకుని వస్తున్న ఓ అమయకుణ్ణి చూసి అది జంతు మాంసం అంటూ కేసులు నమోదు చేసి జైలు పంపిస్తున్నారని, ఈ విషయం మా దృష్టికి వస్తే అధికారితో మాట్లాడితే దురుసుగా మాట్లాడారని సభలో పేర్కొన్నారు. అటవీ హద్దులు తొలుగుతున్న అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేయగా…సభలో ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడిన తీరుపై ఎంపీటీసీ రాం రెడ్డి,తిమ్మాపూర్ ఎంపీటీసీ మహిళ సభ్యురాలు మండిపడ్డారు. సంభాషణ తీరు మార్చుకోవాలని ఫారెస్ట్ అధికారికి ఎంపీపీ కొత్త పుష్పాలత కిషన్ రెడ్డి, ఎంపీడీఓ భాస్కర శర్మ ఆదేశించారు. స్మశానవాటికలో నీటి సదుపాయం కోసం విద్యుత్ సౌకర్యం కల్పించాలని, కరెంట్ లేక అక్కడున్న మొక్కలు ఎండిపోతున్నారని చౌదర్ పల్లిసర్పంచ్ కుమార్ ఏఈ కనకయ్య దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.తదనంతరం మిగతా శాఖ అధికారులు సభలో ప్రసంగించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ చింతల జ్యోతి, పీఏసీఎస్ షేర్ల కైలాసం, పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.

Spread the love