మహిళా ఆత్మహత్య యత్నం..

– కాపాడిన గంగి చిన్న సాయిలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని నడిపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ మండలంలోని ఘనపూర్ గ్రామ చెరువు లో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.అ చెరువు వద్ద తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చెరువుల వద్ద పండగ చేస్తున్నా గ్రామస్తులు చుసి కేకలు వేయడంతో అటువైపు వెళ్తున్న ఘనపూర్ గ్రామ రైతు సమన్వయ కమిటీ నాయకులు గంగి చిన్న సాయిలు వేంటనే చెరువు లో దుకి ఆమెను ఒడ్డుకు తీసుకవచ్చి ప్రాణాలను కాపాడార .ఆమె నడపల్లి గ్రామానికి చెందిన మహిళా గా గుర్తించారు.అత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పలువురు సాయిలు చుట్టిన సాహసం తో అభినందించారు.గత కోన్ని రోజులుగా నడ్ పల్లి గ్రామానికి చెందిన పలువురు ఇదే చెరువులో ఆత్మహత్య లు చేసుకున్నారు. ఇంట్లో ఏదైనా గోడలు చోటుచేసుకున్న ఆత్మహత్య లే శరణ్యం అంటు విలువైన ప్రాణాలను చేజేతులా పోగోట్టు కుంటున్నాను. అధికారులు ఆత్మహత్య ల నివారణకు చర్యలు చేపట్టి అవగాహన సదస్సు నిర్వహించాలని పలువురు పేర్కొంటున్నారు.

Spread the love