వికలాంగులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు..

– ఎన్నికల మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల అభివృద్ధి కి కృషి..
– 2కె రన్ లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగానిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తెలంగాణ రన్ ను డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడవ బెటాలియన్ నాగపూర్ గేట్ నుండి కెఎన్అర్ గార్డెన్ వరకు 2కె రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు, ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్,ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, నిజామాబాద్ డివిజన్ అర్డిఓ రవి లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు 11 రోజులుగా పండగల జరుపుకుంటున్నామని,ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నాడని తెలిపారు.ఎన్నికల మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తున్నరని వెల్లడించారు. రాష్ట్రంలో గురుకులను ఏర్పాటు చేసి 60 లక్షల విద్యార్థులకు సంవత్సరానికి ఒక్క విద్యార్థి పై 1.20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. వికలాంగులుకు వేయి రూపాయలు అదనంగా పెంచడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన నియోజకవర్గం 5 వేళ మంది వికలాంగులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.ప్రతిపక్షాలు ఏం హామీ తో ప్రజల్లోకి రావలో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని పేర్కొన్నారు.ఆరోగ్య తెలంగాణ కోసం పట్టణ, పల్లె క్రీడ మైదాలను ఏర్పాటు చేసి యువకులు శారీరకంగా, మానసికంగా పట్టిష్టం చేస్తున్నా సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన జడ్పిటిసిలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సొసైటీ డైరెక్టర్లు, సర్పంచులు ఎంపీటీసీలు ఉపసర్పంచ్లు పార్టీ సీనియర్ నాయకులు తహసిల్దార్ శ్రీనివాస్ రావు ,పోలీసులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు

Spread the love