డ‌చ్ యూట్యూబ‌ర్‌పై చిక్‌పేట్ వ్యాపారి దాడి

నవతెలంగాణ – బెంగ‌ళూర్ : డ‌చ్ యూట్యూబ‌ర్‌పై బెంగ‌ళూర్‌లోని చిక్‌పేట్ వ‌ద్ద ఓ స్ధానిక వ్యాపారి దురుసుగా వ్య‌వ‌హ‌రించాడు. ఆ ప్రాంతంలో యూట్యూబ‌ర్ వీడియో రికార్డు చేస్తుండ‌గా అత‌డిని అడ్డ‌గించిన వ్యాపారి దౌర్జ‌న్యం చేశాడు. హోల్‌సేల్‌, రిటైల్ దుస్తుల వ్యాపారానికి పేరొందిన చిక్‌పేట్‌లో యూట్యూబ‌ర్ వీడియో రికార్డు చేస్తుండ‌గా స్దానిక వ్యాపారి అభ్యంత‌రం తెలిపారు. యూట్యూబ‌ర్ పెడ్రో మోటాను వ్యాపారి అడ్డ‌గించి దురుసుగా వ్య‌వ‌హ‌రించాడు. యూట్యూబ‌ర్ న‌మ‌స్తే పెడుతున్నా వినిపించుకోని వ్యాపారి న‌మ‌స్తే ఎందుకు నువ్వు ఇక్క‌డ ఏం చేస్తున్నావ్ అంటూ అత‌డి చేయి ప‌ట్టుకుని గ‌ట్టిగా మెలితిప్పాడు. ఎట్ట‌కేల‌కు వ్యాపారి ప‌ట్టు నుంచి విడిపించుకున్న యూట్యూబ‌ర్ ఎలాగోలా అక్క‌డినుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. పెడ్రో ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. చిక్‌పేట్ క్లాత్ మార్కెట్ విశేషాల‌ను తాను రికార్డు చేస్తుండ‌గా స్ధానిక వ్యాపారి కోపోద్రిక్తుడై త‌న ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించాడ‌ని ఆ పోస్ట్‌లో పెడ్రో రాసుకొచ్చారు.

Spread the love