మల్లాపూర్ లో ఐమాక్స్ లైటింగ్ బిగింపు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని  మల్లాపూర్ గ్రామంలో ఐమాక్స్ లైటింగ్ ను మంగళవారం బిగించినట్లు సర్పంచ్ లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్ రఘునథన్ రాము లు తెలిపారు. ఐమాక్స్ లైటింగ్ బిగించాడనికి ఇందల్ వాయి జడ్పీటిసి సభ్యురాలు గడ్డం సుమన రవి రెడ్డి జడ్పీ నిధులు 1 ఒక లక్ష 50 వేల రూపాయలు మంజూరు చేసినట్లు సర్పంచ్ లోలం సత్యనారాయణ ఉప సర్పంచ్ రఘునథన్ రాము తెలిపారు. అడిగిన వెంటనే నిధులను మంజూరు చేసినందుకు గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. మల్లాపూర్ గ్రామ అభివృద్ది కి ముందుకొచ్చి గ్రామాన్ని అన్ని విధాలా సహాయ సహకారం చేస్తున్న ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, యువనాయకులు బాజిరెడ్డి జగన్ మోహన్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Spread the love