అసంతృప్తిని తొలగించుకునేందుకే తెరపైకి ఉమ్మ‌డి పౌర‌స్మృతి: శ‌ర‌ద్ ప‌వార్

నవతెలంగాణ ముంబై : న‌రేంద్ర మోడీ స‌ర్కార్‌పై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అసంతృప్తిని తొలగించుకునేందుకు ఉమ్మ‌డి పౌర‌స్మృతి (యూసీసీ) కేంద్రం తెర‌పైకి తీసుకువ‌చ్చింద‌ని ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం లా క‌మిష‌న్‌కు నివేదించింద‌ని, క‌మిష‌న్ వివిధ వ‌ర్గాలు, సంస్ధ‌ల నుంచి ప్ర‌తిపాద‌న‌ల‌ను కోరింద‌ని ప‌వార్ పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ లా క‌మిష‌న్‌కు 900 ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయ‌ని, వీటిలో ఏముంద‌నేది త‌న‌కు తెలియ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను క‌మిష‌న్ బ‌హిర్గ‌తం చేయ‌లేద‌న్నారు. ఇక యూసీసీపై సిక్కులు, జైన్‌లు, క్రిస్టియ‌న్ వ‌ర్గాలు త‌మ అభిప్రాయం వెల్ల‌డించాల్సి ఉంద‌న్నారు. సిక్కులు దీనిపై భిన్న వైఖ‌రితో ఉన్నార‌ని త‌న‌కు తెలిసింద‌ని ప‌వార్ చెప్పారు. ఈ వ‌ర్గం వైఖ‌రిని మ‌నం విస్మ‌రించ‌రాద‌ని ప‌వార్ పేర్కొన్నారు.

Spread the love