నవతెలంగాణ – ముంబయి: ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ పై దక్షిణాఫ్రికా వెటరన్ ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డాడు. రోహిత్, బుమ్రా వంటి అనుభవజ్ఞులున్న చోట అటువంటి శైలి జట్టుకు పెద్దగా ఉపయోగపడదని తెలిపారు. ముంబయి జట్టులో తీవ్ర అసంతృప్తులున్నాయంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈ కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.