నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు

 

నవతెలంగాణ – ఢిల్లీ: ప్రముఖ హేతువాది, మహారాష్ట్రకు చెందిన రచయిత నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు పడింది. ఈ కేసులో వీరిని దోషులుగా తేల్చిన పుణె కోర్టు.. శుక్రవారం శిక్ష ఖరారు చేసినట్లు తెలిసింది. మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తన గళం వినిపించిన దభోల్కర్‌.. ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి’ స్థాపించి ప్రజల్లో అవగాహన కల్పించేవారు. ఆ క్రమంలోనే ఆయనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. 2013, ఆగస్టు 20న ఉదయం నడకకు వెళ్లిన ఆయనపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మొదట పుణె పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా.. తర్వాత దానిని సీబీఐకి బదిలీ చేశారు. 11 ఏళ్ల తర్వాత ఈ కేసులో దోషులకు శిక్ష పడింది.

Spread the love