చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి స్టార్ ఆటగాడు

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు డెవాన్‌ కాన్వే రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. చేతివేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి కాన్వే దూరమయ్యాడు. ఈ క్రమంలో కాన్వే స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్‌కే ఫ్రాంచైజీ పడింది. అతడి స్ధానాన్ని దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌తో భర్తీ చేయాలని చెన్నై యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అతడితో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Spread the love