ఎస్‌పి ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ సోలంకి నివాసంపై దాడులు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ సోలంకి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం దాడులు చేపట్టింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఇర్ఫాన్‌ నివాసంతో పాటు కాన్పూర్‌, ఉత్తరప్రదేశ్‌లలోని ఆయన కుటుంసభ్యుల నివాసాల్లోనూ సోదాలు జరుపుతున్నట్లు ఇడి అధికారులు తెలిపారు. పలు క్రిమినల్‌ కేసుల్లో 2022 డిసెంబర్‌ నుండి సోలంకి మహారాజ్‌ గంజ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఓ మహిళపై వేధింపుల కేసులో ఇర్ఫాన్‌, ఆయన సోదరుడు రిజ్వాన్‌తో పాటు మరో ముగ్గురిపై యుపి గ్యాంగ్‌స్టర్స్‌, యాంటీ సోషల్‌ యాక్టివిటీస్‌ (ప్రొవెన్షన్‌) యాక్ట్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే.

Spread the love